by Suryaa Desk | Tue, Nov 19, 2024, 01:01 PM
ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధిర మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపట్నం గ్రామానికి చెందిన రాజేశ్వరి మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వెంటనే గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.