by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:57 PM
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో ఆత్మకూరు మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచులను సోమవారం రాత్రి ముందస్తు అదుపులోని కి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ కమల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేయడం.
ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగుతుందని పౌర హక్కులను కాలరాస్తుందన్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం మాజీ సర్పంచ్ కమల రాజేశ్వరరావు, నీరుకుల్లా మాజీ సర్పంచ్ హర్షం బలరాం, లింగమడుగు పల్లి మాజీ సర్పంచ్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు