by Suryaa Desk | Wed, Nov 20, 2024, 04:22 PM
వేములవాడలో ఏర్పాటు చేసిన సీఎం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేదల కోరికలు తీర్చే రాజన్న ఆలయ విస్తరణ పనులకు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, గత ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం వేములవాడలో ఇచ్చిన మాటని విస్మరిస్తే, ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఆలయ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని చెప్పిన మాటని నేడు సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారు అన్నారు.
తెలంగాణను రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టారని సీఎం రేవంత్ మండిపడ్డారు. వేములవాడలో బుధవారం సీఎం మాట్లాడుతూ.. 'బండి సంజయ్‌ను 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధికి ఏమైనా చేశారా? కరీంనగర్ గురించి బండి సంజయ్ పార్లమెంట్‌లో ఎప్పుడైనా మాట్లాడారా? BRS, BJP నేతలు పనిచేసి ఉంటే సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి.. గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి వెళ్లాల్సి వచ్చేది' అని విమర్శించారు.