by Suryaa Desk | Tue, Nov 19, 2024, 10:05 PM
లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి శాతకర్ణి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ వారి డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యాశాల రేకుర్తి వారి సౌజన్యంతో సోమవారం ఉదయం 10 గం. ల నుండి మ.2.00 గం. వరకు పెద్దపల్లి పట్టణంలోని ఐటిఐ గ్రౌండ్ లో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిభిరం విజయవంతం అయింది.లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యాశాల రేకుర్తి చైర్మన్ కొండా వేణు మూర్తి పీడీజీ,వైస్ చైర్మన్ చిదుర సురేష్ పీడీజీ సహకారంతో నిర్వహించిన ఈ నేత్ర వైద్య శిబిరంలో 70 మంది కి పైగా హాజరైనారు. కంటిలో శుక్లాలు ఉండి కంటి చూపు మందగించిన 43 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు గుర్తించి వారిని 43 మందిని బస్సులో రేకుర్తి నేత్ర వైద్యాశాలకు తరలించనైనది.
ఇట్టి కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యాశాల రేకుర్తి చైర్మన్ కొండా వేణు మూర్తి పీడీజీ, వైస్ చైర్మన్ చిదుర సురేష్ పీడీజీ కు కృతజ్ఞతలు. ఈ క్యాంపు లో రేకుర్తి హాస్పిటల్ సిబ్బంది ప్రభాకర్, రీజియన్ చైర్ పర్సన్ వేల్పురి సంపత్ రావు, జోన్ చైర్పర్సన్ రేకులపల్లి సుష్మ,లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి శాతకర్ణి ప్రసిడెంట్ గుంటి కుమారస్వామి, సెక్రటరీ మాదిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఇతర సభ్యులు పాల్గొన్నారు.