by Suryaa Desk | Tue, Nov 19, 2024, 08:41 PM
నార్నూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులను ముందాస్తుగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం లగచర్ల గ్రామ గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పిఏసిఎస్ ఇంచార్జ్ చైర్మన్ ఆడే సురేష్ డిమాండ్ చేశారు. లగ చర్ల బాధిత రైతుల రక్షణ కోసం ఢిల్లీకి బయలుదేరిన బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కు మద్దతుగా నార్నూర్ మండలం బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మద్దతు తెలిపేందుకు బయలుదేరగా సోమవారం నార్నూర్ సిఐ రహీం భాష ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచికపై విడుదల చేశార. అరెస్ట్ అయిన వారిలో పిఎసిఎస్ చైర్మన్ ఆడే సురేష్ బీంపూర్ మాజీ సర్పంచ్ రాథోడ్ విష్ణు డి ఆర్ ఎస్ జనరల్ సెక్రెటరీ సయ్యద్ ఖాసిం టౌన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్ రాథోడ్ సుభాష్ సుల్తాన్ బాబా ఖాన్ రాథోడ్ శివాజీ షేక్ మసూద్ ఆడే సుభాష్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.