by Suryaa Desk | Tue, Nov 19, 2024, 08:32 PM
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో రంగయ్య చెరువు ,ఎర్ర చెరువులతో రిజర్వాయర్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ముంపు గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి సోమవారం రోజున నల్లబెల్లి తహసిల్దార్ ముప్పు కృష్ణకు వినతి పత్రం అందజేశారు రిజర్వాయర్ ఏర్పాటుతో 10 తండాలు పాత గోవిందాపురం, లైన్ తండా, మూడు చెక్కలపల్లి, ఎర్ర చెరువు తండా, బుల్లియ తండా, కొండాపురం, మురళి నగర్, గణేష్ నగర్ ,ఆసరవెల్లి, లక్ష్మీ తండా గ్రామాలతో పాటుగా 3000 వేల ఎకరాల భూమి ముంపుకు గురై సుమారు పదివేలకు పైగా మందికి నిలువ నీడ లేకుండా పోతుందని ముంపు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలువలు రీ డిజైన్ పేరుతో కాలువల తవ్వి వాటి ద్వారా నీటి సరఫరా చేయడం ద్వారా తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మాకు ఇబ్బంది కలుగుతుందని ముంపు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఒకవేళ రిజర్వాయర్ నిర్మాణం జరుగితే ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు తలెత్తూతాయని ఇప్పటికైనా అధికారులు రిజర్వాయర్ నిర్మాణం పై పునరాలోచన చేసి మమ్మల్ని ఆదుకోవాలని ముంపు గ్రామాల ప్రజల తరఫున కమిటీ సభ్యులు కోరుతున్నారు.