by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:44 PM
ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని పరిశుభ్రతను పాటించాలని ఆత్మకూరు మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన పిలుపునిచ్చారు. మంగళవారం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో( ఏ ఎమ్ ఆర్) ఆంటీ మైక్రో బయాల్ రెసిస్టెంట్ అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు.. ఈ సందర్భంగా డాక్టర్ స్పందన మాట్లాడుతూ యాంటిబెట్ మందుల వినియోగం విచ్చలవిడిగా కాకుండా న్యాయబద్ధంగా ఉండాలన్నారు.
డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్ మందులనే పూర్తి కోర్స్ వాడాలన్నారు. ఇన్ఫెక్షన్ల ఆవిర్భావం వ్యాప్తి అరికట్టడానికితగిన సలహాలు సూచనలు తెలియజేశారు. సూక్ష్మజీవుల వ్యాప్తి నిరోధానికి పరిశుభ్రత ప్రధాన ఆయుధమనిఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఆర్ అవగాహన కార్యక్రమం పై వైద్య సిబ్బంది రోగులచే ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుష్పలీల, డాక్టర్ చైతన్య, సి హెచ్ ఓవైద్య సిబ్బంది,కందకట్ల సంపత్, తదితరులు పాల్గొన్నారు.