by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:17 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దగ్గరికి వస్తున్న ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ సిరిసిల్ల జిల్లాను ఎంతగానో అభివృద్ధి పరిచినట్టు సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సభ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సీఎం సభ అడ్డుకుంటారేమని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని. కానీ టిఆర్ఎస్ నాయకులు సభను అడ్డుకోమని ప్రజలే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు కాబట్టి ప్రజలే రేవంత్ రెడ్డి నీ అడ్డుకొని వారికి బుద్ధి చెప్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో మట్ల మధు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగాని మనోహర్, ముస్తాబాద్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, పదిర వెంకటేష్, కంచర్ల రవి గౌడ్, జహంగీర్, నక్క కొమురయ్య, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.