by Suryaa Desk | Tue, Nov 19, 2024, 09:48 PM
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గుంజాల, తాడిహాడప్నూర్ శివారులో పులి సంచరిస్తూన్నట్టు గ్రామస్తులు తెల్పారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు గుంజాల గ్రామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పెద్ద పులి ఓ వ్యక్తిని చూసే సరికి గుంజాల పార్కు నుంచి తాడిహాడప్నూర్ శివారు ప్రాంతాల్లో వెళ్లిందని స్థానికుల సమాచారం.
ఈ విషయం అటవీ శాఖ అధికారులకు అందించగా అటవీశాఖ అధికారులు గుంజాల గ్రామంలో పెద్దపులి సంచరించిన ప్రాంతంలో అడుగుజాడలు పరిచిలించి ఏ ప్రాంతం లోకి వెళ్లిందని సమాచారం సేకరిస్తన్నారు. వ్యవసాయ పనుల కోసం పొలంలోకి వెళ్ళిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పశువుల కాపరులు అటవీకి వెళ్లొద్దని సూచించారు. దీంతో రైతులు వ్యవసాయ పనులు చేయాలంటే భయ భ్రాంతులకు గురౌతున్నారు. ఎక్కడైనా పెద్దపులి సంచరించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.