by Suryaa Desk | Wed, Nov 20, 2024, 02:26 PM
వేములపల్లి మండలం ఆమనగల్లులో తండ్రి లేని నిరుపేద కుటుంబానికి చెందిన ఉత్తెర్ల రేణుకకి ఈనెల 23న పెళ్లి తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. అప్పటినుంచి తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.
తన కూతురు పెళ్లి ఖర్చులు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉందని పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు తెలుసుకున్నారు. బుధవారం పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయంతో పాటు క్వింటా బియ్యం ఇవ్వడం జరిగింది.