by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:12 PM
పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లకు చెందిన 152 మంది లబ్ధిదారులకు 65 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని అన్నారు.