by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:55 PM
Aతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో తలపెట్టిన మహిళా శక్తి బహిరంగ సభకు ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ నేతలుమహిళలు తరలి వెళ్లారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల నుండి కాంగ్రెస్ అభిమానులు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పర్వతగిరి రాజు నాగేల్లి సామెల్, కంచ రవికుమార్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, బరుపట్ల కిరీటి, గ్రామ పార్టీ అధ్యక్షులు బయ్య కుమారస్వామి ( నెంబర్) రేవూరి జైపాల్ రెడ్డి, మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్ భయ్య తిరుపతి మైనార్టీ నాయకులు ఖాజా యువజన కాంగ్రెస్ నాయకులు తనుగుల సందీప్, గౌని రాజు అల్వాల రవి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు