by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:19 PM
లగచర్ల బాధితులను పరామర్శించేందుకు బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం కు చెందిన గిరిజన సంఘాల నాయకులు తరలి వెళ్లారు. అంతకు ముందు వారు కడ్తాల్ లో మాట్లాడుతూ ఫార్మా పేరుతో పేదల భూములను లాక్కోవడం అన్యాయమని, ఈ విషయం పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. దాడి తర్వాత గిరిజన తండాలలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని, బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపేందుకు తరలి వెళ్తున్నట్లు చెప్పారు.