by Suryaa Desk | Wed, Nov 20, 2024, 04:00 PM
వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని, సారవంతమైన భూమి దెబ్బతింటుందని, అంతేకాకుండా వరి కోసిన తర్వాత వరి కొయ్యల పైన వేస్ట్ డీ కంపోజర్ మిశ్రమాన్ని పిచికారీ చేయడం ద్వారా కూడా వరి కొయ్యలన్ని మురిగి పోతాయని, కావున వాటిని కాల్చకుండా భూమిలో కలియదున్నితే మంచి ఫలితాలను పొందవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వ్యవసాయ అధికారులు మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు దృశ్యమాధ్యమం ద్వారా అవగాహన కల్పించారు. అలా కాకుండా అవగాహన లేమితో కాల్చితే వచ్చే సీజన్‌లో పోషకాల లోపం ఏర్పడి పంట దిగుబడి తగ్గడంతో పాటు భావితరానికి నష్టం చేకూర్చిన వారవుతారని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నరసింహ రావు, ఏడీఏ సురేష్ బాబు, ఏవో శంకర్ లాల్, టెక్నికల్ ఏవో సురేష్ బాబు, ఏఈవోలు, పలు ఫర్టిలైజర్ షాప్ ల డీలర్లు, రైతులు పాల్గొన్నారు.