by Suryaa Desk | Wed, Nov 20, 2024, 04:03 PM
సమగ్ర వ్యవసాయ రంగంలో విశిష్ట కృషి చేస్తున్నందకుగాను జోగిపేటకు చెందిన మహిళా రైతు దీపికకు రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఇందిరాగాంధీ ప్రతిభ పురస్కార్ అవార్డుకు ఎంపికైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన ఐదుగురు జోగిపేట మహిళా రైతు ఉండడం విశేషం. మంగళవారం హైద్రాబాద్‌లోని ఎగ్జిబీషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీపిక లింగారెడ్డికి ఇందిరా గాంధీ ప్రతిభ పురస్కార్ అవార్డును రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్బంగా ఉత్తమ రైతు దీపికరెడ్డి మాట్లాడుతూ తాను గత కొన్ని సంవత్సరాలుగా బయోగ్యాస్ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తున్నానని, అందుకు ప్రభుత్వం నన్ను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం తరపున ఇచ్చిన ఈ అవార్డుతో తాను మరింత ఉత్సాహంగా సమగ్ర వ్యవసాయ రంగంలో ముందుకు పోతానన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అగ్రికల్చర్ చైర్మన్ కోదండరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.