by Suryaa Desk | Wed, Nov 20, 2024, 07:54 PM
పదేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఉద్ధరించిందని వరంగల్ లో విజయోత్సవ జరుపుకుంటుందని, ఆరు గారంటీ అమలు చేశారని, ఆరు గ్యారంటీలు ఏగ కొట్టినందుకా అని బిఆర్ఎస్ సీనియర్ నేత, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం జగదేవపూర్ లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అవుతున్న అభివృద్ధిలో పదిహేళ్లు వెనుక పోయిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయి అమలు చేయకుండానే అన్ని చేశామని అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వరంగల్ వేదికగా రైతు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నేడు అమలు చేసిన చేశామని వరంగల్ వేదికగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. పెంచిన పింఛన్లు ఇవ్వలేదు, మహిళలకు నెలకు 2500 ఇస్తామని ఇవ్వలేదు, రైతుబంధు ఇస్తామని ఇవ్వక, అలాగే క్వింటలకు 500 బోనస్ ఇస్తామని ఇవ్వక ఇవన్నీ ఇచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనిస్తున్నారని, ఎక్కడెక్కడ రైతులు రోడ్లెక్కి నిరసన తెలుపగా మరోవైపు ప్రజలు కూడా రోడ్లకే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. పథకాలను అమలు చేయాలని ప్రతిపక్ష నేతలు అడిగితే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, దాడులకు దిగడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు.