by Suryaa Desk | Wed, Nov 20, 2024, 08:07 PM
సూరారంలోని అరోరా ఫార్మా కంపెనీలో బుధవారం ఉదయం ప్రమాదం సంభవించింది. ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తుండగా.. కార్మికుడు అనిల్(43) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఫార్మా సిబ్బంది.. గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఫార్మా కంపెనీ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.