by Suryaa Desk | Wed, Nov 20, 2024, 07:46 PM
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయుడు రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణలో మా ప్రభుత్వం 70శాతానికిపైగా కులగణనను పూర్తి చేసింది. త్వరలో కులగణనకు సంబంధించిన పూర్తి డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది.
ఈ డేటాను ప్రభుత్వ విధివిధానాలను రూపొందించడానికి, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తాం. కులగణన అనేది రాబోయే రోజుల్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక చేయడంలో సహాయపడుతుంది’’ అని పేర్కొన్నారు.