by Suryaa Desk | Sun, Sep 22, 2024, 11:00 AM
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని ఎర్రవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో రుణమాఫీ కానీ 66 మంది బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. చైర్మన్, సీఈవోల మధ్య సమన్యాయ లోపంతో తమకు అన్యాయం జరిగిందని రైతులు లబోదిబోమన్నారు. ఇటీవల సీఈఓ ని సస్పెండ్ చేస్తూ సొసైటీ చైర్మన్ వ్యక్తిగత తీర్మానం చేయడం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఈవో హుస్సేన్ సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటని రైతులు, డైరెక్టర్లు నిలదీశారు.
సీఈఓ సస్పెండ్ ఎత్తివేస్తూ పాలకవర్గం సమావేశం కాగా చైర్మన్ శ్రీనివాసరావు గైహాజరయ్యారు. దీంతో రైతులు ఆవేశంతో సొసైటీ కుర్చీలను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో రైతులు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, మంగమ్మ, సైదులు, నాన్ రాజ్, ఆశీర్వాదం, రవీందర్, వెంకటేశ్వర్లు, మాజీ సొసైటీ చైర్మన్ కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, లతీఫ్, మధు, వర్ధన్ రావు, ఉద్దండు, సుజాత, గంగిరెడ్డి, రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.