by Suryaa Desk | Sun, Sep 22, 2024, 11:30 AM
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం గంగలో కొట్టుకుపోయిందని, గలగల పారుతున్న కళేశ్వరం నీళ్లు హరీష్ రావు మల్లన్నసాగర్లోకి వచ్చాయనడం సిగ్గుచేటని,మీరు కట్టిన కాళేశ్వరం నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదని అక్కం స్వామి విమర్శించారు. తొగుట మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి మాట్లాడుతూహరీష్ రావు మాటలు ఊసరవెల్లి రంగులు మార్చినట్లే ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో నిర్మించిన ఎల్లం పల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేరుకు అలానే అన్నపూర్ణ ప్రాజెక్టు మరియు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా తర్వాత నింటిని పంపింగ్ చేయడం జరిగిందని తెలిపారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండే మల్లన్న సాగర్ లోకి 21 టిఎంసిల నీటిని పంపింగ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. హరీష్ రావు ఇప్పటికైనా చిల్లర మాటలతో ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున మల్లన్న సాగర్ సందర్శనకు వచ్చినటువంటి హరీష్ రావు తన మార్క్ అయినటువంటి అబద్ధాల పరంపరను మళ్ళీ కొనసాగించారని విమర్శలు గుప్పించారు.మూడు బ్యారేజీలు కొట్టుకపోయాయని అన్నారని, ఈ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చాయని మాట్లాడాడానికి సిగ్గుండాలి అన్నారు.
హరీష్ మీ బ్యారేజీలు కొట్టుకుపోయిన సంగతి ప్రపంచం మొత్తం చూసిందని గుర్తు చేశారు. గతంలో మల్లన్న సాగర్ లోకి 17 టీఎంసీల నీళ్లను దాటి నింప లేకపోయారని విమర్శించారు. నేడు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తరువాత ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి పంపింగ్ చేసి 21 టీఎంసీల నీటిని నింపామన్నారు.ఇప్పటికైనా అబద్ధాలు మానుకొని ప్రజలను తప్పుదోవ పట్టించోద్దని అన్నారు.కార్యక్రమం లో సీనియర్ నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొంగరి నరసింహులు, మహిపాల్ రెడ్డి గంట రవీందర్, లింగాల కృష్ణ ఎన్ఎస్యూఐ మండలం అధ్యక్షులు ప్రవీణ్ మరియు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.