by Suryaa Desk | Sun, Sep 22, 2024, 12:57 PM
ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాలకు గురైన నీరుపేదలకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మనూర్, నాగల్గిద్దా, నారాయణఖేడ్ మండలాలకు సంబందించిన సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కును లబ్ధిదారుకు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒకరు ఆరోగ్యశ్రీని ఉపయోగిచుకోవాలని అన్నారు. ఏ ఆసుపత్రిలోనైనా ఆరోగ్యశ్రీ సేవలు లేదు అంటే నా దృష్టికి తీసుకోరావాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల పెంచిందని అన్నారు.