by Suryaa Desk | Sat, Sep 21, 2024, 01:31 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్ట నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద కాల్వ తేగడంతో మరమ్మత్తులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని బిఆర్ఎస్ నాయకులు ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తిపొడిచే మాటలు చెప్పడం సరికాదని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశానుసారం రైతులను ఆదుకునేందుకు ఎడమ కాలువ గుండా వెళ్లే కొత్తగూడెం,14b పాలవరం మేజర్ కాలువను ప్రత్యామ్నాయ పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్క్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగూడెం,14b పాలవరం మేజర్ కాల్వ కింద వేల ఎకరాలకు నీరు పారించి, రైతులను ఆదుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.14b పాలవరం మేజర్ కాల్వ వద్ద అడ్డుకట్ట వేసి రెండు రోజుల్లో నీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు,మండల నాయకులు పుల్లారెడ్డి,వాసు,కొండయ్య,కోటేశ్వరావు,బాబు, వెంకట్ రెడ్డి,ముత్తినేని కోటేశ్వరావు, స్వరూప,సైదులు,హనుమంతు,వెంకటేశ్వర్లు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.