by Suryaa Desk | Sun, Sep 22, 2024, 11:15 AM
జగిత్యాల్ జిల్లా రాయికల్ మండలంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ ఉమెన్ రైట్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా చైర్మన్ గా ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం చిన్న లింబాద్రి గౌడ్ ను నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం శుక్రవారం తెలంగాణ స్టేట్ చైర్మన్ డాక్టర్ నోముల సంపత్ గౌడ్ నియమించి నియామక పత్రం గుర్తింపు కార్డు అందజేశారు.
ఈ సందర్భంగా సంపత్ గౌడ్ మాట్లాడుతూ చిన్నపిల్లల మీద అరాచకం అఘాయిత్యం చేసేవాళ్లను నిలదీసి అడగడం,గంజాయి మత్తు పదార్థాలను సేవించే వాళ్లను నిరోధించి అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరికి మంచితనాన్ని అందించడానికి కృషి చేస్తూ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ చైర్మన్ కస్తూరి లక్ష్మారెడ్డి, కరీంనగర్ జిల్లా వైస్ చైర్మన్ కె.వి. రామకృష్ణ, జిల్లా అబ్జర్వేషన్ కమిటీ చైర్మన్ చౌడారపు శ్రీధర్, సభ్యులు రొట్టె శ్రీధర్.చంద్రకంటి రవీందర్,రంజిత్,మహేష్, సామల్ల నవీన్, ఆడెపు రాము, నాయిని అనిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.