![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 03:45 PM
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల వినికిడి సమస్యకు చేసే సర్జరీ అయిన 'కాక్లియర్ ఇంప్లాంట్' సర్జరీకి వయసు పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇంతకాలం పిల్లలకు మూడు సంవత్సరాల వరకు మాత్రమే ఆరోగ్య శ్రీ కింద ఈ శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వెలుసుబాటు ఉండేది. ప్రస్తుతం దీన్ని ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు పొడిగించింది. ఈ సర్జరీకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ.6 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంది.