![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:50 PM
బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో పి డి ఎస్ యు నాయకులు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7. 57 శాతం నిధులు కేటాయించారని, ఇది విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని అన్నారు. 30 శాతం నిధులు కేటాయించి విద్యపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.