![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 04:02 PM
ఆటో డ్రైవర్లు, ఆటోలను నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై మహేందర్ అన్నారు గురువారం మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. లైసెన్స్‌లు తప్పకుండా తీసుకోవాలన్నారు.