![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 04:02 PM
దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి.
షాదీ ముబారక్, రైతు బీమా చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.