|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 02:23 PM
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది.హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్సీఏను హైకోర్టు ఆదేశించింది. నార్త్ స్టాండ్స్కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు.మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలుఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ తెలంగాణ హై కోర్ట్ను ఆశ్రయించాడు. రెండు దశాబ్దాల పాటు క్రికెటర్గా భారత జట్టుకు సేవలందించానని.. దాదాపు పదేళ్లపాటు టీమిండియా కెప్టెన్గా ఉన్నానని తెలిపారు. అంబుడ్స్మన్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అజారుద్దీన్ పేరు తొలగించవద్దని ఆదేశించింది.దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.అజారుద్దీన్ హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు తన పేరు పెట్టుకున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని అజారుద్దీన్ ఏకపక్షంగా తీసుకున్నాడని లార్డ్స్ క్రికెట్ క్లబ్ హెచ్సీఏ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య.. హెచ్సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ఆదేశించారు. టికెట్లపై కూడా అజారుద్దీన్ స్టాండ్ అనే పేరు ఉండొద్దని తేల్చి చెప్పారు.ఈ తీర్పును సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను భారత జట్టుకు ఆడానని, సారథ్యం కూడా వహించానని తెలిపారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని తన వాదనను వినిపించారు. దాంతో హై కోర్ట్.. అంబుడ్స్మన్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.