|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 04:49 PM
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని, ఈ విషయాన్ని రాసిపెట్టుకోవాలని కూకట్‌పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. వరంగల్‌లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని ఆయన అన్నారు. కూకట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.వరంగల్ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని, దేశంలోనే ఇటువంటి భారీ సభ జరగలేదని కృష్ణారావు అన్నారు. ఈ సభ విజయాన్ని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు వస్తున్న వేలాది వాహనాలను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పథకం ప్రకారం అడ్డుకున్నారని దుయ్యబట్టారు.