|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 06:19 PM
కులగణన చేపట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని అభినందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ఇందుకు ప్రధాని, కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందని సీఎం అన్నారు. రాహుల్ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారని కొనియాడారు. దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణనే అని వివరించారు.కుల గణనపై కేంద్రం నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామనడం హర్షించదగిన అంశమని పేర్కొన్నారు. రాహుల్ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టామన్న ఆయన.. కేంద్రం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడితో కులగణనకు ఒప్పుకొందన్నారు.