|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 06:25 PM
టెన్త్ ఫలితాల్లో 73% మార్కులు సాధించిన విద్యార్థికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు. భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర చారి అనే విద్యార్థిది నిరుపేద కుటుంబం. ఆ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గతంలో వాళ్ల ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం, నిత్యవసరాల సరుకులు అందజేసి కష్టపడి చదవాలని విద్యార్థికి సూచించాడు. భరత్ స్థిరపడే వరకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చాడు. కలెక్టర్ సూచన, ప్రోత్సాహంతో విద్యార్థి భరత్ చంద్ర చారి కష్టపడి చదివి 73% మార్కులతో టెన్త్ పాస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే భరత్ చంద్ర చారి, తల్లి విజయలక్ష్మి లకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు