|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 07:08 PM
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ప్రక్కన ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు పైన డబ్బాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వారికి గతంలో ప్రభుత్వం జీ.హెచ్.ఎం.సీ. నుండి లైసెన్స్ మంజూరు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డబ్బాలను తొలగిస్తామని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, బాధితుల వినతిపై ఈ రోజు సుధీర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరు ఎలాంటి భయాందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క డబ్బా కూడా తొలగించకుండా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. చిన్న చిన్న వ్యాపారాలతోనే బాధితులు వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, వారి ఉపాధిని దూరం చేస్తే ఆయా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నోటీసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవికుమార్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.