|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 03:35 PM
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు.. నిన్న రూ.8,29 లక్షల కోట్లు అని చెపుతున్నాడు. నేడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... పూటకో లెక్క మాట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమేరాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క..మీ లాగా కాకి లెక్క కాదుచెప్పులు ఎత్తుకపోవడానికి వేరే పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లెక్కనే చూస్తారు రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్, లగ్జరీ ప్రయాణాలు అన్ని ప్రజలు చూస్తున్నారుఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ? నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి లీటర్ రూ.200 చేసి సంపద పెంచాలని అనుకుంటున్నాడు ధరలు పెంచడం కాదు రేవంత్ రెడ్డి, బుర్ర పెంచు.. సంపద పెంచే ఆలోచన చేయికోసుకొని తినడానికి నువేమన్నా మామిడి పండా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నా అంటున్నావు, దమ్ముంటే 43 సార్లు నీ ఢిల్లీ ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయ్ రేవంత్ రెడ్డి చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా అని కేటీఆర్ అన్నారు