ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 03:34 PM
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చలు సఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు.
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, పలువురు కీలక డిమాండ్లపై స్పష్టత లభించిందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన సమావేశంలో, ఉద్యోగుల భద్రత, వేతనాలు, పదోన్నతులపై సమగ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.