|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 07:45 PM
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు సమర్థించారు. సీఎం చేసిన కామెంట్స్ లో తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. 'ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదు. ఆర్టీసీ ఉధ్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నారు, అందుకే సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు' అని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి ముక్కు సూటి మనిషి అని, విషయాన్ని కుండబద్దలు కొట్టారని ఆయన చెప్పారు. సీఎం చేసిన వ్యాఖ్యలతో కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కానీ అదే వాస్తవం అని తేల్చి చెప్పారు. కొంతమంది ప్రభుత్వాన్ని బెదిరించినట్లుగా కామెంట్స్ చేశారు, దాంతో సీఎం రేవంత్ ఆవేదనతో అలా మాట్లాడారని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉధ్యోగులకు మూడో వారంలో జీతాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ చేసిన ఘనకార్యానికి అప్పులు వచ్చే పరిస్థితి లేదని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటి? ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదు