|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 02:53 PM
దుబాయ్ లో చిక్కుకున్న మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దధర్పల్లి గ్రామానికి చెందిన గోపాల్ ను కలుస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు దుబాయ్ వెల్లి బుధవారం కలిశారు. అక్కడ అడ్వకేట్ & లీగల్ కన్సల్టెంట్ బొబ్బిలిశెట్టి అనురాధ గారితో సమావేశం అయ్యారు. గోపాల్ యొక్క కేసు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇది వరకు నమోదు అయినా కేసుతో పాటు కొత్తగా మరో కేసు నమోదు అయినట్టు ఆమె తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కేసు బెయిల్ వచ్చే విధంగా కృషి చేయాలని న్యాయవాది ని కోరారు. అనంతరం గోపాల్ తల్లి తో పాటు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, త్వరలో ఇంటికి గోపాల్ చేరుకుంటాడని తెలిపారు. న్యాయపరంగా అవసరం అయినా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే బెయిల్ వస్తుందని పేర్కొన్నారు. సమస్య ఉందని చెప్పిన వెంటనే స్పందించి దుబాయ్ దాక వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి గోపాల్ బంధువు కామరాం నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు. గోపాల్ ను బయటికి తీసుకువచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులను కోరినట్టు పేర్కొన్నారు. మాజీ మంత్రి గారి వెంట ప్రముఖ NRI గుమ్మడాల శ్రీకాంత్ మరియు తదితరులు ఉన్నారు.