|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:13 PM
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర అధికారులతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, అవకతవకలు లేకుండా మూడు విడతలలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.