|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:46 PM
అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. క్యాన్సర్ దేవుడు ఇచ్చిన శాపం కాదని, మన జీవన విధానంలోనే అది మొదలవుతుందని ఆయన అన్నారు. క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తిస్తే జయించవచ్చని, చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడటం బాధాకరమని అన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.అనంతరం కార్యక్రమ నిర్వహాకులు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో 40, 50 సంవత్సరాల పైబడిన వారికే క్యాన్సర్ వ్యాధి వచ్చేది కానీ ఇప్పుడు వయసు సంబంధం లేకుండా చిన్న వయసుల వారు అంటే 5, 10 ఏళ్ల పిల్లలు కూడా క్యాన్సర్ బారీన పడుతున్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలు, వంశపరాంపర్యం, రేడియేషన్, రసాయణ పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడికి గురై డయాబెటిస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ ప్రజల్లో అవగాన తక్కువ ఉండడంతో క్యాన్సర్ చివరి దశల్లో డాక్టర్ల దగ్గరకి వస్తున్నారు. అవగాహన అనేది చాలా కీలకం, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం కిమ్స్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశ్యం చికిత్స పొందిన అనంతరం సాధారణ జీవితం గడుపుతున్న రోగులు ఏకమై ముందుకు వచ్చి, క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే వ్యాధేనని, చికిత్స పట్ల భయం అవసరం లేదన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పాలన్నారు.