|
|
by Suryaa Desk | Sun, Feb 22, 2026, 03:35 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భార్యే భర్తను కిరాతకంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను శ్వాస ఆడకుండా దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష(35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని ప్రేమించి 2018 పెళ్లి చెసుకున్నారు. చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన శరత్ చేవెళ్లలోని గణేష్ నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. రాజశ్వేరికి ఆరు నెలల క్రితం శరత్ అనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఇద్దరి మద్య శరీరక సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొద్ది రోజులు రాజేశ్వరి శరత్‌ను దూరం పెట్టింది. 'నీ భర్త రోజు మద్యం సేవించి వస్తాడు.. నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు... నేను నిన్ను బాగా చూసుకుంటా' అని ప్రియుడు రాజేశ్వరిని నమ్మించాడు. ఇద్దరు కలిసి ఉండాలంటే అతడిని అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్నారు. గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చిన భర్తతో భార్య గొడవ పడింది. అనంతరం నిద్ర పోయాక ప్రియుడికి ఫోన్ చేసి రప్పించింది. ప్రియుడితో కలిసి కాళ్లు చేతులు కట్టి మొఖంపై దిండు పెట్టి శ్వాస అడకుండా చేయడంతో పాటు ఛాతిపై కూర్చున్నారు.
కృష్ణ మృతి చెందాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత తెల్లవారుజూము వరకు అక్కడే ఉండి శరత్ వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం భర్త పలకడం లేదని ఆటోను రప్పించుకొని పట్నం మహేందర్ రెడ్డి వైద్యకళాశాలకు తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందాడని చెప్పడంతో మళ్లి అదే ఆటోలో ఇంటికి తీసుకవచ్చి ఆమె తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. అతడు కృష్ణ తల్లి అంజమ్మకి ఫోన్ చేసి చెప్పటంతో ఆమె వచ్చి చూసి భార్యపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి భార్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.