by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:54 PM
గత ఏడాది పుష్ప-2 చిత్రంతో శ్రీవల్లిగా కనిపించింది టాప్ లేపింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా . వరుసగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. కథ ఎంపికలోనూ జోరు చూపిస్తోంది. ప్రస్తుతం 'ఛావా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థామా’. దినేశ్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ప్రేమకథా చిత్రమిది. దీనిని ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ శుక్రవారం ‘ఛావా’ సినిమాతో పాటుగా థియేటర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.రెండు కాలాల మధ్య కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రష్మిక జాబితాలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘సికందర్’, ‘కుబేర’ చిత్రాలున్నాయి.
Latest News