![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 05:57 PM
సౌత్ వర్సెస్ నార్త్ చర్చ ఇప్పటిది కాదు. చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ విషయంపై మరోసారి తన అభిప్రాయాలను షేర్ చేశారు. తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "తీయగలిగే సత్తా ఉన్నా కూడా ‘పుష్ప 2’ వంటి చిత్రాలను బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ రూపొందించలేకపోతున్నారు. పుష్ప వంటి చిత్రాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్‌కు సామర్థ్యం లేక కాదు. కానీ, వారు ఆ విధంగా ఆలోచించడం లేదు. దక్షిణాది, ఉత్తరాది.. ప్రేక్షకులు ఎక్కడైనా ఒక్కటే. సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకువస్తాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తోన్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేేసే వాళ్లు. సౌత్‌లో ఉన్న ఆనాటి అగ్రహీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారు.కొంతకాలానికి మ్యూజిక్ కంపెనీలు వెలిశాయి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాయి. తమ సంస్థను ప్రమోట్ చేయడం కోసం సినిమాల్లోకి పాటలు తీసుకువచ్చాయి. అదే సమయంలో అమితాబ్ సుమారు ఐదేళ్లు విరామం తీసుకున్నారు. దాంతో చిత్ర పరిశ్రమ మ్యూజికల్ మూవీస్ వైపు వెళ్లింది.. ‘మైనే ప్యార్ కియా’, ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ వంటి సినిమాలు పుట్టుకొచ్చాయి. ఇటీవల కొత్తతరం దర్శకులు వచ్చారు. బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ.. విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అదే తరహా చిత్రాలను రూపొందిస్తున్నారు. ఆ విధంగా బాలీవుడ్ నెమ్మదిగా తమ మేకింగ్ స్టైల్ మర్చిపోయింది. మాస్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడం మానేసింది. కానీ, సౌత్ పరిశ్రమలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడి వారు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణమైన చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారు. మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.
Latest News