![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 05:56 PM
సహజంగా మన సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో విడుదల అవుతుంటాయి, అది కూడా మూడు, నాలుగు వారాల తర్వాత. కానీ చిత్రంగా ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి... ఆపైన థియేటర్లలో సందడి చేసే కల్చర్ మొదలైంది. ఈ యేడాది జనవరి 3న ‘ఎవోల్‘ మూవీ థియేటర్లలోకి వచ్చింది. నిజానికి ఈ మూవీ గత యేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. పరమ బూతు చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాను థియేటర్లలో జనాలు చూడరని నిర్ణయించుకున్న దర్శక నిర్మాత దానిని అప్పట్లో ఓటీటీలో పెట్టేశారు. అయితే... ఆశ చావకన్నట్టుగా మొన్న జనవరిలో దీనిని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. బట్ ఫలితం వారు ఊహించినట్టుగానే జరిగింది. జనాలు ‘ఎవోల్‘ ( మూవీని తిరస్కరించారు.ఇప్పుడు అదే తరహాలో ఐదేళ్ళ క్రితం ఓటీటీలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల‘ మూవీ పేరు మార్చుకుని థియేటర్లలో ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా రాబోతోంది. ఓటీటీకి సెన్సార్ ఉండదు కాబట్టి... అప్పట్లో దర్శక నిర్మాతలు తమకు నచ్చిన రీతిలో ఈ మూవీని తీసేసి వ్యూవర్స్ మీదకు వదిలేశారు. కానీ థియేట్రికల్ రిలీజ్ అనేసరికీ ఆ పప్పులు ఉడకవు. అందుకే సెన్సార్ చేయిస్తే... ముందు వేటు మూవీ టైటిల్ మీద పడింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల‘ అనే టైటిల్ ను అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకు ఇవ్వడానికి వారు ససేమిరా అన్నారు. దాంతో ఈ మూవీ పేరును ‘ఇట్స్ కాంప్లికేటెడ్‘ (It's Complicated) గా మార్చారు. అలానే సెన్సార్ నిబంధనలకు అనుసరించి, అన్నింటికి ఆమోదం తెలిపాక... ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి అనుమతి లభించింది.
Latest News