![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 12:07 PM
ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' అద్భుతమైన కలెక్షన్స్ దూసుకుపోతూ.. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాల అనౌన్స్ మెంట్ అయిపోయింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఓటీటీల కన్నా ముందే టీవీలో ప్రదర్శించనున్నట్లు జీ 5 ప్రకటించింది.
అయితే బాలయ్య డాకు మహారాజ్ పై మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు.జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటివారు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనేలా ‘డాకు మహారాజ్’ టాక్‌ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా బాలయ్య కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.
Latest News