by Suryaa Desk | Wed, Feb 12, 2025, 12:08 PM
‘యానిమల్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి. గతేడాది విడుదలైన ‘బ్యాడ్ న్యూస్’, ‘భూల్ భులయ్య-3‘ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీంతో అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రానున్న ‘ది రాజా సాబ్’లో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రం ‘డ్రాగన్’లోనూ ప్రత్యేక పాటతో అలరించబోతున్నారట. అటు బాలీవుడ్‌లో పర్విన్ బాబీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్, అదేవిధంగా సందీ్‌పరెడ్డి వంగా - రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో రానున్న ‘యానిమల్ పార్క్’ చిత్రంలోనూ త్రిప్తి డిమ్రి నటించనున్నారు. కాగా, వెకేషన్ మూడ్‌లో ఉన్న ఈ బ్యూటీ మాల్దీవుల్లో సముద్ర తీరాన సేద తీరుతూ ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News