![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 12:14 PM
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఓ వీరాభిమాని తన ఆస్తిని మొత్తం రాసిచ్చేశారు. నిషా పటేల్(62) అనే మహిళకు సంజయ్ నటనంటే అభిమానం ఎక్కువ. మరణానంతరం తన ఆస్తి మొత్తం సంజయ్‌కు దక్కేలా ఆమె 2018లో వీలునామా రాశారు. ఇందుకు కావాల్సిన బ్యాంకు పనులన్నీ పూర్తి చేశారు. రూ.49 లక్షల క్యాష్.. కొన్ని ప్రాపర్టీ్‌సతో కలిపి ఆ ఆస్తి విలువ రూ.72 కోట్లు. ఇది తెలిసి సంజయ్ ఆశ్చర్చపోయారు. ఆయనను అంతలా అభిమానించిన నిషా పటేల్‌ను కలుసుకోలేకపోయినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె రాసిచ్చిన ఆస్తిని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. అది వారి కుటుంబసభ్యులకు లేదా ప్రభుత్వానికి చెందేలా చేయమని తన లాయర్‌ను కోరారు.
Latest News