by Suryaa Desk | Wed, Feb 12, 2025, 12:02 PM
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తరచూ రాజకీయ వేదికలపై కనిపిస్తున్నారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో తదితర విషయాల్లో చిరంజీవి చురుగ్గా ఉండడంతో మళ్లీ ఆయన రాజకీయం వైపు అడుగేస్తారేమో అనుమానం వ్యక్తమవుతున్న తరుణంలో చిరంజీవి స్పందించారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీరంగానికి సేవలు, ఇతర సేవా కార్యక్రమాల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని ఆయన చెప్పారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తమ్ముడు పవన్ కల్యాణ్ ఉన్నాడని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా. ‘పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు. ఏంటీ? అటువైపు ఏమైనా వెళ్తాడా?’ అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. కళామతల్లి సేవలోనే ఉంటాను’’ అని అన్నారు.
Latest News