![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 03:57 PM
ప్రముఖ దర్శకుడు మరియు నటుడు ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' అని ఆసక్తికరంగా టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు. డ్రాగన్ పేరుతో వస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ టైటిల్ కి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అని లాక్ చేశారు. మేకర్స్ ఈ చిత్రాన్ని ఆసక్తికరమైన మరియు సృజనాత్మకంగా ప్రోత్సహిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ యూట్యూబ్ లో 1.7 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ 3 పోసిషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అశ్వత్ మారిముతు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ పరేమేశ్వరన్, కయాడు లోహర్, జార్జ్ మరియన్, కెఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు మైస్కిన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్, నైకెత్ బోమి సంగీతం మరియు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు మరియు కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్ మరియు కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్ (పి) లిమిటెడ్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 21 ఫిబ్రవరి 2025న విడుదల అవుతోంది.
Latest News