![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 05:55 PM
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నారు. అభిమానులు మాత్రం 'వాట్ నెక్ట్స్ బన్నీ’ అంటూ చర్చలు మొదలుపెట్టారు. బన్నీ తదుపరి చిత్రం ఏంటి? అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనే కదా అని సమాధానం వినిపించేది. ఆయన అదే పనిలో ఉన్నారనీ టాక్ నడిచేది. బన్నీ ఫ్యాన్స్ కూడా అదే అనుకున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి అట్లీ పేరు పైకి వచ్చింది. త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా, అట్లీ సినిమా మొదలవుతుందన్న ఓ గాసిప్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. బన్నీ - అట్లీ కాంబోలో ఓ సినిమా ఉంటుంది. అది చాలా కాలంగా వినిపిస్తోంది. కాకపోతే.. త్రివిక్రమ్ కంటే ముందే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు తక్కువ.త్రివిక్రమ్ , బన్నీ కోసం ఓ కొత్త తరహా కథ రాస్తున్నారు. స్పాన్ ఎక్కువ ఉన్న కథ ఇది. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం త్రివిక్రమ్ సమయం తీసుకొంటున్నారు. విజువల్‌గా కొంత ప్రీ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్న సినిమా ఇదని తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సీన్స్ డిజైన్ చేయాలి. పైగా ఈ జోనర్ త్రివిక్రమ్‌కు పూర్తిగా కొత్త. అందుకే త్రివిక్రమ్ ఇంత టైమ్ తీసుకొంటున్నారని వినికిడి. ఒకసారి యాక్షన్ చెబితే నాన్ స్ట్టాప్‌గా షూట్ చేస్తూనే ఉంటారు. మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్‌కి టైమ్ పడుతుంది. బన్నీ కూడా త్రివిక్రమ్ సినిమా తొందరగా మొదలైతే బాగుంటుందని ఆశ పడుతున్నాడు. ‘పుష్ప 2’ తర్వాత.. తనకు ఇదే పర్‌ఫెక్ట్ సినిమా అవుతుందన్నది బన్నీ నమ్మకం. అందుకే.. త్రివిక్రమ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏక కాలంలో రెండు సినిమాలు చేయడం కష్టం. ఎందుకంటే త్రివిక్రమ్ ది పెద్ద ప్రాజెక్ట్. అట్లీ కూడా చిన్న సినిమా లేం తీయడు. తను కూడా పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో ఉంచుకొనే కథ రాసుకుంటాడు. రెండు సినిమాల్లోనూ గెటప్పులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి.. ఒకేసారి రెండు ప్రాజెక్టులు తెరకెక్కడం కష్టం. ఒకవేళ త్రివిక్రమ్ నా సినిమాకు ఇంకా టైమ్ ఉంది. ఈలోగా నువ్వేమైనా చేసుకో అంటే బన్నీ అట్లీ సినిమా వైపు వెళ్లాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Latest News