![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 03:47 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్ల డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతుంది. దీంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘డాకు మహారాజ్’ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.అయితే, ‘డాకు మహారాజ్’ చిత్రానికి సంబంధించి ఇతర భాషలలో డబ్బింగ్ చేసిన కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌కు చేరలేదని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న ‘డాకు మహారాజ్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
Latest News