![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 05:58 PM
ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం.. ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత- మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్ర కథానాయకుడు చిరంజీవి హాజరాయ్యరు. తాత-మనవడి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కడంతో ఈ ఈవెంట్‌లో బ్రహ్మానందం, చిరంజీవి వారి తల్లిదండ్రులు, తాతయ్యల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.చిరంజీవి మాట్లాడుతూ ‘‘మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన చాలా దానధర్మాలు చేసేవారు. ఆ మంచి బుద్ధి నాకు కొంచెం వచ్చింది. ఇక రామ్ చరణ్ తాతయ్య అంటే మా నాన్న విషయానికొస్తే చాలా అందగాడు. ఆయన గ్లామర్ మాకెవ్వరికీ రాలేదు. ఆయన మా హీరో. అలాగే క్లీంకార తాతయ్య (చిరంజీవి) గురించి చెప్పాలంటే.. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లు ఉండదు. ఏదో లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలు. అందుకే అబ్బాయిని కనమని రామ్‌చరణ్‌ను అడుగుతుంటాను. మన వారసత్వం కొనసాగాలని అంటుంటా’’ అని సరదాగా అన్నారు.
Latest News